Site icon TeluguMirchi.com

ఇదేం ’పేరంటం’ కాదు!

balakrishna(1)

బాలయ్య ఎన్నికల ప్రచారం దూసుకుపోతున్నాడు. ఇప్పటికే బాలయ్య శ్రీకాకుళం పర్యటన విజయవంతం అయింది. నేడు విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. బాలయ్య తో పాటుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన అభిమానులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. అయితే, తెదేపా తరుపున ప్రచారం చేయడానికి అనాసక్తిని చూపుతున్న అన్న హరికృష్ణపై బాలయ్య మొదటిసారి స్పందించారు. ప్రచార పర్వంలో హరికృష్ణ పాల్గొన్నయితే.. ఆయనకు పార్టీలో సముచిత న్యాయం కల్పిస్తామని హామి ఇచ్చారు. ఓ వైపు పార్టీ బలోపేతానికి హరికృష్ణని ఆహ్వానిస్తూనే.. మరోవైపు తనదైన శైలిలో సెటైర్స్ వేశాడు. ’బొట్టుపెట్టి పిలవడానికి ఇదే పేరంటం కాదు.. ప్రచారం చేయడానికి ఎవరైనా రావచ్చు’ అని బాలయ్య అన్నారు. కాగా, గతంలో జూ. ఎన్టీఆర్ ని ఉద్దేశించి బాలయ్య ఇవే కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. హరికృష్ణ వ్యవహారాన్ని బాలయ్య ఒక్కమాటలోతేల్చేశాడని.. ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.

Exit mobile version