తెలుగు దేశం పార్టీ స్థాపించినప్పటి నుండి అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గం టీడీపీకి కంచు కోటగా మారింది. ఎన్టీఆర్ పలు సార్లు హిందూపురం నుండి పోటీ చేసి గెలిచిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ తర్వాత కూడా తెలుగు దేశం పార్టీ ఆ స్థానంను దక్కించుకుంటూ వస్తుంది. 2014 ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు బావమర్ది అయిన నందమూరి బాలకృష్ణ ఆ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.
2019లో మరోసారి అక్కడ నుండి బాలయ్య పోటీ చేయాలని భావిస్తున్నాడు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన రహస్య సర్వేలో బాలయ్యపై హిందుపురం తెలుగు దేశం కార్యకర్తలు మరియు ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా వెళ్లడైంది. ఆ కారణంగా బాలకృష్ణను హిందూపురంకు దూరం చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. బాలకృష్ణకు రాజ్యసభ సీటు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
అయితే బాలయ్యకు మాత్రం ఎంపీగా వెళ్లే ఆసక్తి లేదు. మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రి పదవి చేపట్టాలనేది బాలయ్య కోరిక. కాని చంద్రబాబు నాయుడు మాత్రం హిందూపురంకు బాలయ్యను దూరం చేసే యోచన చేస్తున్నాడు. మరి బాలయ్య ఆ సమయంలో ఏ చేస్తాడనేది చూడాలి. ఒక వేళ బాలయ్యను హిందూపురంకు దూరం చేస్తే మండలికి పంపించి మంత్రిని చేసే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి బాలయ్యకు హిందూపురం టికెట్ ఇవ్వకుంటే పరిస్థితి ఏంటీ అంటూ ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.