Site icon TeluguMirchi.com

సీఎం సీటులో కూర్చున్న బాలయ్య

ఆంధ్రప్రదేశ్‌ సీఎం క్యాంపు ఆఫీస్‌లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గత మూడు రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు ముఖ్యమైన మంత్రులో దావోస్‌ సభకు హాజరు అయ్యేందుకు విదేశాల్లో ఉన్నారు. ఈ సమయంలోనే సీఎం క్యాంపు ఆఫీస్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం నియోజక వర్గంకు సంభందించిన సమీక్ష నిర్వహించారు.

సమీక్ష సమావేశంను బాలకృష్ణ సీఎం చంద్రబాబు నాయుడు కార్యలయంలో నిర్వహించాడు. అక్కడి వరకు ఆగితే పర్వాలేదు. కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూర్చునే కుర్చిలో కూర్చుని బాలయ్య సమీక్షలో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా బాలయ్యతో పాటు పలువురు అధికారులు మరియు మంత్రులు కూడా పాల్గొన్నారు.

సీఎం కుర్చిలో బాలయ్య కూర్చోవడం పట్ల వారు కాస్త అభ్యంతరం వ్యక్తం చేయాలని భావించినా కూడా ఏ ఒక్కరు నోరు మెదపలేదు. బాలయ్య సీఎం కుర్చిలో కూర్చుని ఉండగా ఉన్న ఒక ఫొటోను మీడియాకు విడుదల చేయడం జరిగింది. అది కాస్త వైరల్‌ అవ్వడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబ పాలనకు ఇది ప్రత్యక్ష సాక్ష్యం అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎద్దేవ చేస్తున్నారు.

చంద్రబాబు స్థానంలో బాలయ్య ఎప్పటికైనా అలా కూర్కోవాని నందమూరి ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మొత్తానికి బాలయ్య తెలియక చేశాడో లేదా తెలిసి చేశాడో కాని కుర్చి విషయం చర్చనీయాంశం అవుతుంది. విదేశాల నుండి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ విషయమై ఎలా స్పందిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version