Site icon TeluguMirchi.com

బాబుతో.. బాలయ్య సుదీర్ఘ చర్చలు !

Balayya-chandrababuతెదేపా అధినేత చంద్రబాబు నాయుడుతో.. బావమరిది బాలయ్య సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. ఈరోజు ఉదయం బాబు నివాసంలో సమావేశమైన వీరు.. ప్రధానంగా కుటుంబ పరమైన విషయాలపై చర్చించిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చోటు చేసుకున్న ఫ్లెక్సీల వివాదంతో… బాబు, హరికృష్ణల మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో.. వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. హరికృష్ణ మహానాడుకు హాజరైతేనే నందమూరి కుటుంబం తెదేపా పక్షాన ఉన్నట్టు ప్రజలు విశ్విస్తారని బాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బాలయ్యను హరికృష్ణ వద్దకు రాయబారం పంపేందుకు బాబు నిశ్చయించుకున్నట్టు సమాచారం. అయితే, బావ, అన్న హరికృష్ణల మధ్య సఖ్యత కుదర్చడంలో బాలయ్య ఎంతవరకు సఫలీకృతం అవుతారో వేచి చూడాలి మరి!.

Exit mobile version