విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జీ నాగుల్ మీరా ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు శుక్రవారం సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా వారు సీఎం చంద్రబాబును శాలువాలతో సత్కరించారు.
విజయవాడలో హజ్ హవుస్ నిర్మించాలని వారు కోరగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కడపతో పాటు విజయవాడలో కూడా హజ్ భవన్ లను నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ లోని హజ్ భవన్ కూడా తన హయాంలోనే నిర్మించిన విషయం గుర్తుచేశారు. షాదీఖానాలు, కబరస్తాన్ ల అభివృద్దికి నిధులు మంజూరు చేశామన్నారు. ముస్లింల సంక్షేమం, భద్రత, యువత ఉపాధికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ, సంక్షేమశాఖ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, రావెల కిషోర్ బాబు, జడ్ పీ ఛైర్ పర్సన్ గద్దే అనూరాధ, ముస్లిం సంఘాల నేతలు కరీముల్లా, ఇర్ఫాన్, షరీఫ్, ఫతేఖాన్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ ముస్లిం సాధికార కమిటీ, తెలుగుదేశం మైనారిటీ సెల్ నేతలు హాజరయ్యారు.