Site icon TeluguMirchi.com

కొనసాగుతున్న కోర్టు వాదనలు, వాయిదా పర్వం

ys-jaganవైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్థుల కేసులో కోర్టు విచారణలు, వాదనలు, వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. జగన్‌ తరపున రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై మొదలయిన విచారణ ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా పడింది. సీబీఐ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని కోర్టును కోరారు. దాంతో మధ్యాహ్నం 2.15 గంటలకు కేసు విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. మరోవైపు సీబీఐ గడువు కోరుతూ చేసిన విజ్ఞప్తికి జగన్ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. వారు న్యాయస్థానాన్ని జగన్ బెయిల్ పిటిషన్ వాదనలు త్వరగా వినాలని కోరారు.

కాగా ఇదే కేసుకు అనుబంధంగా సాగుతున్న మరో కేసులో విచారణకు గాను రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. విచారణకు ప్రభుత్వ అనుమతులు అవసరం లేదంటూ సీబీఐ మెమోపై వాదనల కోసం కోర్టు ఆదేశాలతో వారు కోర్టుకు హాజరయ్యారు.

Exit mobile version