కరోనా కష్ట సమయంలో నెల్లిమర్ల MLA బడ్డుకొండ చొరవ…

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో చౌక ధరల దుకాణాల ద్వారా ఫ్రీ రేషన్ అందించాలని ప్రభుత్వం ప్రకటించింది. తదనుగుణంగా ఏప్రిల్ నెల రేషన్ సరకులు ముందుగానే అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ రోజు భోగాపురం మండలంలో పంచాయతీ కార్యాలయం వద్ద గౌరవ శాసనసభ్యులు శ్రీ బడ్దుకొండ అప్పలనాయుడు గారి చేతులు మీదుగా రేషన్ నిత్యవరస సరుకులు ఉచితంగా పంపిణీ ప్రారంభోత్సవం కార్యక్రమం చేపట్టారు.ఉచితం రేషన్ సరుకులను ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే బడ్దుకొండ మాట్లాడుతూ ప్రతీ కార్డు దారుని కుటుంబంలోని ఒక వ్యక్తికి 5 కిలోల బియ్యం, కార్డుకి ఒక కేజీ కంది పప్పు ప్యాకెట్ ను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.కరోనా నేపధ్యంలో ఉపాధి కోల్పోతున్న పేదలు ఆహారానికి ఇబ్బంది పడకూడదనే ఉండేందుకు ప్రభుత్వం మూడు దశలలో ఫ్రీ రేషన్ అందించాలని నిర్ణయం తీసుకుందన్నారు. మొదటి విడతలో భాగంగా ఈ రోజు నుంచి ప్రారంభించామని అలాగే ఏప్రిల్ నెల 15 నుంచి రెండో విడత , ఏప్రిల్ 29న మూడవ విడత ప్రతీ కార్డుదారునికి ఉచిత రేషన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిస్తారని అన్నారు.సామజిక దూరాన్ని పాటించాలని అన్నారు…