పెద్దమనసు చాటుకున్న నెల్లిమర్ల MLA బడ్డుకొండ

నెల్లిమర్ల – MLA అప్పలనాయుడు గారు, తనవంతు సాయంగా అలోవెన్సులతో కూడిన 2 నెలల వేతనాలను విరాళంగా ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న అయన తను 2 నెలల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నానని ప్రకటించారు. అంతేకాకుండా మరిన్ని విరాళాలు సేకరించి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు పుంపనున్నట్లు తెలిపారు.

కరోనా ప్రభావితం పై కర్ఫ్యూ నేపధ్యంలో గడిచిన వారం రోజులుగా ఆహార ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈరోజు మహారాజ మరియు గోషా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు మరియు వారి సహాయ సేవలు చూసుకునేవారకి నెల్లిమర్ల శాసన సభ్యులు శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారు మరియు దివ్య జీవన సమాజ సభ్యులు సుమారు 250 మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు….