ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మందు బాబులకు షాక్ ఇచ్చాడు. న్యూ ఇయర్ వేడుకలను గ్రాండ్ గా జరుపుకోవాలని మందు బాబులంతా వారి ప్లాన్ లలో వారు ఉంటె..జగన్ మాత్రం వారికీ కిక్ లేకుండా చేసాడు. డిసెంబర్ 31వ తేదీన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సాధారణంగా ప్రతి కొత్త సంవత్సరం వేళ సందర్భంగా ప్రతి ఏటా మద్యం దుకాణాల టైమింగ్ విషయంలో మార్పులు చేస్తుంటారనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తెలంగాణలో సైతం మద్యం దుకాణాలకు మరో గంట ఎక్కువ టైమ్ కేటాయించింది. అయితే ఏపీలో మాత్రం ఎలాంటి వెసులుబాటు కల్పించలేదు. ప్రతి రోజు మాదిరిగానే యథావిధిగా మద్యం అమ్మకాల వేళలు జరుగనున్నాయి.
మరోపక్క కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా న్యూ ఇయర్ వేడుకలపై ఇప్పటికే పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. కొత్తగా కరోనా స్ట్రెయిన్ కూడా భయంకంపితులు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేశాయి.