నేడు బీఏసీ.. ??

bac-meetingవిభజన బిల్లును తిరస్కరించి వెనక్కు పంపాలని సీఎం కిరణ్ స్వీకర్ కు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. అసెంబ్లీ రణరంగంగా మారింది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మంత్రులే స్వీకర్ పోడియాన్ని చుట్టిముట్టి ఆందోళనకు దిగుతున్నారు. మంత్రులే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సభలో నినాదాలు చేయడం బహుశా చరిత్రలో ఇదే మొదటిది. ఈ నేపథ్యంలో.. సమావేశాలు సజావుగా సాగే పరిస్థితి కనబడటం లేదు. అయితే, స్వీకర్ బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సభ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోక పోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.

సోమవారమే బీఏసీ నిర్వహిస్తే.. అక్కడ ఏకాభిప్రాయం వచ్చే అవకాశం లేదు. బీఏసీలో కూడా నేతలు ఒకరిపై మరోకరు వారించుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే.. బీఏసీ నిర్వహణపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు స్వీకర్ నాదెండ్ల. ఈరోజు (మంగళవారం) కూడా సభలో సేమ్ సీన్ రిపీట్ కావడంతో.. సభ మరోసారి గంటపాటు వాయిదా పడింది. మరీ.. ఈరోజైనా.. బీఏసీ సమావేశం నిర్వహించి సభ సజావుగా సాగేందుకు నిర్ణయం తీసుకుంటారా.. ? లేదా… ? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, టీ-బిల్లుపై మరింత గడువును పెంచాలని కోరుతూ.. సీఎం కిరణ్ రాష్ట్రపతికి లేఖ రాయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంత్రులే సభ సాగకుండా అడ్డుకుంటున్న నేపథ్యంలో.. చర్చకు మరింత గడువు కావాలని కిరణ్ లేఖలో పేర్కొననున్నారట. మొత్తానికి.. రాజకీయాల్లో ఎప్పుడు లేనంత హాట్ హాట్ వాతావరణం ఏర్పడింది.