రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలి : బాబు

babuవిభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానం తననెంతో బాధించిందని తెదేపా అధినేత అంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నోట్ ని కేంద్ర కేబినేట్ ఆమోదించిన అనంతరం బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలని కోరారు. ఇరు ప్రాంతాల ఐకాస నేతలను కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను పరిష్కరించమని ప్రధానిని, రాష్ట్రపతిని కోరామని… అయినా ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని దయ్యబట్టారు.

గత అరవై నాలుగు రోజులుగా సీమాంద్ర్హలో ప్రజలు స్వచ్చంధంగా రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే.. పట్టించుకునే నాధుడే లేడని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎందుకింత లెక్కలేని తనం, ఎందుకింత పరికితనమని ప్రశ్నించారు. సీమాంధ్రులకు ఏవిధంగా న్యాయం చేస్తారో చెప్పాలని.. లేకుంటే 4 గంటల్లో తీవ్ర నిర్ణయం తీసుకుంటామని బాబు హెచ్చరించారు. కేవలం కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం.. ఇటు తెలంగాణలో తెరాస కాంగ్రెస్ లో విలీనం, అటు సీమాంధ్రలో వైకాపా మద్దతు ఇస్తుందని మాత్రమే విభజన నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డ్డారు. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానంతో ప్రజలకు రాజకీయ పక్షాలపై నమ్మకం పోయిందని బాబు అన్నారు. రాష్ట్రాన్ని విభజించిన సోనియాను ఒక్క మాట అనకుండా జగన్ తనను విమర్శించడమేంటని బాబు ప్రశ్నించారు.