అమిత్‌ షాకు బాబు ఫోన్..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ..కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఫోన్ చేసి పరామర్శించారు. బుధవారం అమిత్‌ షాకు ఫోన్ చేసిన చంద్రబాబు.. అమిత్‌షా ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చంద్రబాబు తెలిపారు.

ఆగస్టు 2న అమిత్ షా కరోనాకు కరోనా సోకినట్టు కొవిడ్-19 పరీక్షల్లో తేలిన సంగతి తెలిసిందే. రుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన అనంతరం ఆగస్టు 14న జరిపిన కరోనా పరీక్షల్లో నెటిగివ్ అని తేలడంతో అమిత్ షా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంట్లో ఐసోలేట్ అవుతున్న క్రమంలోనే మరోసారి అనారోగ్యం బారిన పడటంతో ఆగస్టు 18న అమిత్‌ షా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆరోగ్యం కుదుటపడిన అనంతరం ఆగస్టు 31న ఆయన ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు.