Site icon TeluguMirchi.com

కువైట్ కు చంద్రబాబు..!

chandrababunayuduతెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన “వస్తున్నా మీకోసం” పాదయాత్రకు కువైట్ ప్రవాసాంధ్రులు సైతం సంపూర్ణ మద్దతును ప్రకటించారు. రాష్ట్ర ప్రజల కష్టనష్టాలు తెలుసుకోవడానికి ఆరోగ్య సమస్యలను కూడా లెక్కచేయకుండా.. బాబు చేస్తున్న సుదీర్ఘ పాదయాత్రపై కువైట్ ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, మే 3న కువైట్ లో నిర్వహించే టీడీపీ విజయోత్సవ సభకు హాజరుకావాల్సిందిగా వారు చంద్రబాబును ఆహ్వానించారు. బాబు “వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర ఈ నెల 27న ముగియనుండటంతో.. ఆయన కువైట్ వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా.. ప్రవాసాంధ్రుల నుంచి మద్ధతు లభించడం ‘తెదేపా’కు శుభ సూచికే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version