ఇరకాటంలో చంద్రబాబు !

babu-in-Trouble ఎగదీస్తే బ్రాహ్మాణ హత్య, దిగదీస్తే గో హత్య అన్న చందంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి. ఒక పక్క ఎన్టీఆర్ కుటుంబీకులు తనకు దూరంగా ఉండి ఇబ్బంది పెడుతుంటే, అదే కుటుంబానికి చెందిన వదిన పురంధీశ్వరి కొత్త ఇంబ్బంది తెచ్చిపెట్టారు. పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఉన్న అడ్డంకులను తొలగించేశారు. దీంతో ఇప్పుడు విగ్రహావిష్కరణకు మార్గం సుగుమమయింది. ఎన్టీఆర్ పార్టీగా తెలుగుదేశం సాధించలేని దాన్ని కాంగ్రెస్ లో ఉంటూ.. ఆమె సాధించారు. ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మలను కాంగ్రెస్ పార్టీ యద్దేచ్చగా వాడేసుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇది కాదు ఇరకాటం విగ్రహావిష్కరణ సభకు ఆహ్వానం వస్తే వెళ్లాలా, వద్దా అన్నదే ఆ సమస్య. అప్పుడేప్పుడో మహాభారతంలో రాజసూయ యాగానికి పిలుపువస్తే దుర్యోధనుడు ఇలాంటి సంకట స్థితిలోనే ఇరుకున్నాడు. ఆ పై మనటుయా, మరణించుటయా, అని తెగ మల్లగుల్లాలు పడ్డాడు. ఇప్పుడు చంద్రబాబు విగ్రహావిష్కరణ సభకు వెళితే అక్కడ కాంగ్రెస్ సాధించిన ఈ విజయాన్ని అందరూ పొగుడుతుంటే తాను చప్పట్లు కొట్టాలి. లేదు. వెల్లడం మానేస్తే ఎన్టీఆర్ ను అవమాన పరచి నట్లు అవుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పెట్టిన ఎన్టీఆర్ జాతీయ అవార్డును కొనసాగించడం ద్వారా ఆ క్రెడిట్ కొట్టేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా మరో క్రెడిట్ సంపాదించింది. దీన్ని సాకుగా చూపించి నందమూరి వారసులెవరైనా రేపు కాంగ్రెస్ లో చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు. చతురుడు అయిన చంద్రబాబు ఈ విపత్కర పరిస్థితి ఎలా దాటుతారో చూడాల్సిందే.