Site icon TeluguMirchi.com

’బుల్లెట్’ లా దూసుకెళ్తున్న ’బాబు’.. !

chandrababuరాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సాధారణ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో.. నేతలు ఎవరి వ్యూహాల్లో వారు తలమునకలై వున్నారు. ఎన్నికల్లో సత్తాచాట్టేందుకు ఒక్కో పార్టీ.. ఒక్కో ప్లాన్ తో పావులు కదుపుతోంది. అధికార కాంగ్రెస్ మాత్రం.. ’విభజన’ను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాన్ని చీల్చి అటు పిమ్మట పొత్తులు-ఎత్తులపై లాభపడాలని ఉవ్విర్లాడుతోంది. ఇక, జగన్ పార్టీ.. సమైక్యాంధ్ర సెంటిమెంట్ ను, తెరాస.. సపరేట్ సెంటిమెంట్ ను అస్త్రంగా చేసుకోనున్నాయి. మరీ.. గత రెండు దఫాలుగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ ప్లాన్ ఏంటీ.. ?

’ప్రజల నాడి పట్టడంలో చంద్రబాబుకు మించినోడు లేడు’ ఇది ఆయన ఆప్తులు.. ప్రత్యర్థులు సైతం అంగీకరించే మాట. సమైక్యవాదివా, సపరేట్ వాదివా.. అని ఎంతమంది ఎన్ని విధాల ఇబ్బంది పెట్టినా.. ఏమాత్రం తరుముకోకుండా.. ’నాది ప్రజా వాదం’మని గర్జించారు. అందుకే.. ఏ పార్టీ నేతలకు అంతుపట్టని విధంగా.. వచ్చే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాడు. ఎప్పుడూ రోటీన్ ప్రసంగాలు చేసే చంద్రన్నా.. బుల్లెట్ లా దూసుకుపోతానంటున్నాడు. ఇందుకు నిన్న(ఆదివారం) తిరుపతిలో జరిగిన ప్రజాగర్జననే ఉదాహరణ. ’నేనే లోకల్‌.. మిగిలినోలంతా ఎస్టీడీ అంటూ తిరుపతి వాసులను తెగ ఆకర్షించేసాడు.

ఓవైపు.. కాంగ్రెస్ అవినీతి, కుట్ర రాజకీయాలపై ’ప్రజాగర్జన’లో గర్జిస్తూనే.. మరోవైపు, వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక.. తదితర అంశాలను చక చక చక్కదిద్దుతున్నాడు. అవినీతిని అంతమొందిస్తాం.. అభివృద్దిని అందిస్తామని ప్రజలకు భరోసా ఇవ్వడంలో సక్సెస్ అవుతున్నారని విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. తిరుపతి ప్రజాగర్జనలో వచ్చిన ప్రజాస్పందనను చూసిన చంద్రన్న.. భలే ఖుషి అయ్యాడట. ఇక, మీదట బుల్లెట్ లా దూసుకెళ్తానని చెబుతున్నారు. ఇదండీ.. తెదేపా తెలివైనా.. ప్లాన్. మరీ.. ప్రజలు తెదేపాకు ఏ మేరకు పట్టం కడతారో తెలియాలంటే.. వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే…

Exit mobile version