వైజాగ్ వెళ్లడానికి బాబు కు అనుమతి కావాలట..

విశాఖ పట్నం లోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన లీకైన విషవాయువు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే ఈ విష వాయువు కారణంగా ఎనిమిది మంది మరణించగా..వందలమంది స్పృహ లేకుండా హాస్పటల్ లలో చికిత్స తీసుకుంటున్నారు.

ఈ ఘటనతో 5 గ్రామాల ప్రజలు ఖాళీ చేశారు. మరోవైపు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఘటనపై ఇదివరకే స్పందించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం అనుమతి కోరారు. విశాఖ వెళ్లేందుకు గాను కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరారు. చంద్రబాబు విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించి, పార్టీ తరపున సహాయ చర్యలు చేపట్టేందుకు అనుమతి కోరారు.