Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయం పైకప్పు లీక్.. గర్భగుడిలోకి నీరు !


అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవాన్ని ఈ ఏడాది జనవరి 22న అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. అయితే ఎంతో మంది ఇంజనీర్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భ గుడి పైకప్పు నుండి నీరు లీక్ అవుతుంది. శనివారం రాత్రి అయోధ్యలో కురిసిన వర్షం కారణంగా నీరు కారుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు. రామ్‌లల్లా ముందు పూజారి కూర్చునే ప్రదేశంలో, అలానే వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్‌ అవుతున్నట్టు గుర్తించామని ఆయన వెల్లడించారు. అంతేకాదు నీరు బయటకు పోయేందుకు సరైన డ్రైనేజ్​ వ్యవస్థ లేదని.. ఈ సమస్యపై అధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

Nagarjuna : క్షమాపణలు చెప్పిన నాగార్జున..?

ఈ విషయం తెలియగానే.. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా అక్కడికి చేరుకుని వెంటనే మరమ్మతులు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. “మొదటి అంతస్తు నుంచి నీరు కారుతోంది. పైనున్న గురుమండపం కవర్​ చేయలేదు. రెండో అంతస్తు, శిఖర నిర్మాణం పూర్తయితే గురు మండపంలోకి వర్షపు నీరు రాదు. జూలై నాటికి మొదటి అంతస్తు, డిసెంబరు నాటికి మొత్తం నిర్మాణం పూర్తవుతాయని” ఆయన తెలిపారు.

Sonakshi Sinha : ప్రియుడిని పెళ్లాడిన బాలీవుడ్ బ్యూటీ..