మహిళా భద్రత కోసం ఏపీ ప్రభుత్వం అంటూ గొప్పగా జగన్ సర్కార్ చెపుతుంటే..చాల చోట్ల మాత్రం మహిళల ఫై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీ టూరిజం హోటల్ ఆఫీస్ లో కాంట్రాక్ట్ ఉద్యోగి ఫై జరిగిన దాడి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే..
నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్ ఆఫీస్ లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది ఉషారాణి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా ఉద్యోగులంతా విధిగా మాస్కులు ధరించి ఆఫీసుకు రావాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో మాస్క్ లేకుండా వచ్చిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ను ఉషారాణి ప్రశ్నించింది.
ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ప్రశ్నించేసరికి అతడి కోపం కట్టలు తెచ్చుకుంది. నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఆమెపై విరుచుకుపడ్డాడు. టేబుల్ పై ఉన్న ఓ ఇనుప వస్తువు తీసుకొని దాడిచేశాడు. వెంటనే సహచర ఉద్యోగులు కలుగజేసుకొని భాస్కర్ ను బయటకు పంపించారు. ఈ ఘటన జరిగి మూడు రోజులు కావొస్తుంది. డిప్యూటీ మేనేజర్ దాడితో షాక్ లోకి వెళ్లిన ఉషారాణి, ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై దాడి జరిగినప్పుడు రికార్డైన సీసీటీవీ ఫూటేజ్ ను కూడా అందించింది.
ఫూటేజ్ చూసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు.