Site icon TeluguMirchi.com

అసెంబ్లీని ముట్టడిస్తారా.. ?

ashok-babuఅసెంబ్లీ ముట్టడికి ఏపీ ఎన్జీవోలు రెడీ అవుతున్నారా.. ? లేదా రాష్ట్ర సమైక్యం కోసం మరోసారి సమ్మెకు సై అంటారా.. ? అసలు రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు గానూ సీమాంధ్ర నేతలపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగులు అనుసరించే వ్యూహమేంటి.. ? అనేది ఆసక్తికరంగా మారింది. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన వెంటనే అసెంబ్లీని లక్షల మందితో ముట్టడిస్తామని ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. టీ-బిల్లు.. తీరా అసెంబ్లీకి చేరుకోనే చేరుకుంది. మరీ.. ఇప్పుడు ఏపీ ఏన్జీవోల ఏం చేయబోతున్నారు… ? ఏ రాజకీయ నాయకుడు చేయని లెవల్ లో విభజన బిల్లుపై అశోక్ బాబు వ్యాఖ్యలు చేశారు. తీరా.. బిల్లు అసెంబ్లీకి వచ్చినా.. ఇప్పటి వరకు ఉద్యోగుల స్పష్టమైన కార్యాచరణను రూపొందించలేకపోయాడు.. ఈ బాబు. సమైక్యాంధ్ర స్టార్ బ్యాట్స్ మెన్ లే సలైంట్ గా సైడ్ అయిపోతున్న సమయంలో.. తనకెందుకు ఈ తలనొప్పి అని అశోక్ బాబు ఏమైనా.. భావించి వుంటాడా.. ? లేదా.. హెచ్చరికలను నిజం చేస్తూ.. అసెంబ్లీని ముట్టడిస్తారా.. ? అనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది.

ఎవ్వరి హెచ్చరికలెలా వున్నా.. నిజమైన సమైక్యంధ్ర కోరుకునే ప్రజలు ఓ మంచి నాయకుడి కోసం ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఊరికనే హెచ్చరికలు చేయకుండా.. వ్యూహాత్మకంగా వ్యవహరించి.. రాష్ట్ర సమైక్యత కోసం పాటుపాడే నిజమైన ఉద్యమ నేత కోసం అన్వేషణలో వున్నారు సీమాంధ్ర ప్రజలు. మరీ.. అది ఎవరు కానున్నారు అన్నది వేచి చూడాలి.

Exit mobile version