Site icon TeluguMirchi.com

శాసనసభ ప్రారంభం – వాయిదా!

aఅసెంబ్లీలో సీన్ ఏ మాత్రం మారలేదు. ఎప్పటిలాగే ఈరోజు కూడా సభ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే వాయిదా పడింది. శాసనసభ ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యింది. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మాణాలను తిరస్కరిస్తున్నట్లు స్వీకర్ నాదెండ్ల ప్రకటించడంతో.. ఇరు ప్రాంత ఎమ్మెల్యేలు పోడియం చుట్టుముట్టారు. నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో.. స్వీకర్ సభను వాయిదా వేశారు. కాగా, ఉదయం10గంటలకు బీసీఏ సమావేశం జరగనుంది. అంతకుముందు.. తెలంగాణ, సమైక్య ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చను కోరుతూ టీడీపీ, సమైక్య తీర్మానం కోరుతూ వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానాలను స్వీకర్ కు అందజేశాయి.

Exit mobile version