Site icon TeluguMirchi.com

హిందుకా బాప్ కేసీఆరే…ఒవైసీ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండు దేవాలయాలకు వెళితే, దృడమైన హిందువు అయిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరు దేవాలయాలు సందర్శిస్తారన్నారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. హిందూయిజం పేరుతో తెలంగాణాలో కేసీఆర్ ను బీజేపీ ఓడించలేదన్న ఒవైసీ హిందుకా బాప్ కేసీఆరే అన్నారు. తాము హిందూయిజానికి వ్యతిరేకం కాదని, కేవలం హిందూత్వ విధానాలను వ్యతిరేకిస్తామని అసదుద్దీన్ స్పష్టం చేశారు.

 

బీజేపీ ఎన్ని పిల్లిమొగ్గలేసిన తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యమన్నారు. బీజేపీలో చేరుతున్న లీడర్లంతా రాజకీయ నిరుద్యోగులే అన్నారు ఒవైసీ. ఈరోజు నగరానికి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో ఒవైసీ బీజేపీ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

Exit mobile version