స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి నానుతూ వస్తున్న జమ్ముకాశ్మీర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. లడఖ్ ప్రజలు ఎప్పటి నుండో కోరుకుంటున్న ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడంతో పాటు జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. నేడు పార్లమెంటులో జమ్ముకశ్మీర్ పునర్‌విభజన బిల్లును ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ సందర్బంగా సభ్యులు చర్చలో పాల్గొన్నారు.
ఈ చర్చలో పాల్గొన్న హైదరాబాద్ ఎంపీ ఒవైసీ తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకు పడ్డాడు. బీజేపీ తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సరైనది కాదని అన్నాడు. ఇండియాలో ఫెడరలిజం లేకుండా పోతుందని అన్నాడు. భారత్‌ను కూడా చైనా మాదిరిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కోర్టుకు వెళ్తామంటూ ఒవైసీ అన్నాడు. ప్రస్తుతం ఇండియాలో నాజీల పాలన సాగుతుందని ఒవైసీ సంచలన కామెంట్స్ చేశాడు.