నాసా, ఆర్టెమిస్ మూన్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. చరిత్రలో అత్యంత శక్తివంతమైన రాకెట్ చంద్రునిపై అన్వేషణలో కొత్త శకానికి నాంది పలికింది. ఆర్టెమిస్ 1 టెస్ట్ ఫ్లైట్‌లో వ్యోమగాములు లేనందున, చంద్రుని దిశలో వ్యోమగామి-క్యాప్సూల్‌ను విసిరివేయడం దీని లక్ష్యం. 100మీ-పొడవు ఉన్న ఆర్టెమిస్ వాహనం నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి వెళ్ళింది. ఈ ప్రయోగంలో అన్నీ సక్రమంగా ఉంటే భవిష్యత్ లో సాధారణ మానవులు చంద్రుని పైకి వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది.