Site icon TeluguMirchi.com

సీఎంవా.. కుట్రదారువా..?

cm-kiranతెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలప్తై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. డిప్యూటీ సీఎం దామోధర రాజనర్సింహా అయితే.. ఏకంగా “నువ్వు సీఎంవా.. లేక కుట్రదారువా..? అని ప్రశ్నించారు. రాష్ర్టంలో తెలంగాణ 60వేల ఉద్యోగాలను కోల్పాయిందని ఆయన అన్నారు. 52 యేళ్ల సమైక్య రాష్ట్రంలో కేవలం 12 సంవత్సరాలు మాత్రమే తెలంగాణ నేతలు పరిపాలించారని డిప్యూటీ పేర్కొన్నారు. తెలంగాణ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. 1972లో జై ఆంధ్రా ఉద్యమం చేసినప్పుడు సమైక్యాంధ్రా గుర్తుకురాలేదా.. అని దామోదర సూటిగా ప్రశ్నించారు.

Exit mobile version