వైసీపీ సర్కార్ ప్రస్తుతం విశాఖను మూడు జిల్లాలుగా చేయాలనీ చూస్తుంది. ఆ విధంగా కొత్తగా ఏర్పాటు అయ్యే అరకు జిల్లాకు అల్లూరి పేరు పెట్టి ఆయన పేరును చరిత్రలో నిలుపుతామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. అల్లూరి పోరాటం అంతా విశాఖ గిరిసీమల్లోనే సాగింది.
నాడు అమాయక గిరిజనులను నానా బాధలూ పెడుతున్న తెల్ల దొరలను తరిమికొట్టిన సామిగా అల్లూరిని వారు ఆరాధించారు. రెండేళ్ళ పాటు గిరిజనులతో కలసి అల్లూరి చేసిన పోరాటానికి బ్రిటిష్ అధికారగణం గడగడవణికింది. అందుకే అల్లూరి జిల్లాను ఏర్పాటు చేస్తామని..అది కూడా వైసీపీ సర్కార్ లోనే సాగుతుందని అన్నారు.