పండగల దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు గడువును పొడిగించింది. ప్రస్తుతం 30 రోజుల ముందు మాత్రమే ముందస్తు రిజర్వేషన్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. రేపటి నుంచి ఈ గడువును 60 రోజులకు పొడిగిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లే బస్సుల్లో ఈ ముందస్తు రిజర్వేషన్‌కు అవకాశం కల్పించినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది.
Home వార్తలు ఆంద్రప్రదేశ్ వార్తలు ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం, ఆన్లైన్ బుకింగ్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ !