APSRTC : సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్


సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపిఎస్ఆర్టిసి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. జనవరి 6 నుంచి 18వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సర్వీసులు నడపాలని, ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని నిర్ణయించింది. పండుగ రద్దీ దృష్ట్యా పొరుగు రాష్ట్రాలకూ సర్వీసులు నడపనుంది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెయ్యి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఆర్టీసీ వెబ్‌సైట్, టికెట్‌ బుకింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం కల్పించనుంది.