ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను రోడ్డెక్కేంచుకు సిద్ధమైంది. గ్రీన్, ఆరెంజ్ జోన్ పరిధిలో ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ప్రణాళికి సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఐదు రెడ్ జోన్ జిల్లాల మినహా మిగతా గ్రీన్,ఆరెంజ్ జోన్ లలో బస్సులు ఎలా నడపాలి, కార్యాచరణ ఏంటి అనే దానిపై అధికారులతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నది.
బస్సుల సంఖ్యను కుదించి పరిమిత సంఖ్యలో బస్సులను వివిధ మార్గాల్లో నడిపించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. మొదట కొన్ని బస్సులను నడుపుతూ ఆ తరువాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా బస్సులను పెంచడమో తగ్గించడమో చేయాలనీ చూస్తుంది.