ఇక సమ్మె ముగింపు!?

ashok babuమొన్న విద్యుత్ ఉద్యోగులు నిన్న ఉపాధ్యాయ జేఏసీ…సమైక్యాంధ్ర కోసం చేస్తున్న సమ్మె ముగింపు దశలో ఇప్పుడు ఇక ఏపీఎన్జీవోల వంతు వచ్చింది. విభజనపై కేంద్రం వెనక్కు తగ్గే వరకు సమ్మె విరమించేది లేదన్న ఉద్యోగులు వెనకడుగు వేస్తున్నారా? దాదాపు 70రోజులకుపైగా సమ్మె చేస్తున్నా కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాకపోవడం….రెండు నెలలుగా జీతాలు లేకపోవడం, సీమాంధ్ర రాజకీయ నాయకుల ప్రోత్సాహం లేకపోవడం…ఇవన్నీ ఏపీన్జీవోల సమ్మె విరమణకు పురిగొల్పుతున్నట్లుగా కనిపిస్తోంది. చిన్నగా ప్రారంభించిన సమ్మెను సీమాంధ్ర ప్రజల్లోకి తీసుకువెళ్లి సమైక్య ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించిన ఏపీఎన్జీవోలు సమ్మె విరమణ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటకు సీఎంతో జరిగే చర్చలపై ఎపీఎన్జీవోల సమ్మె ముగిస్తారా లేక కొనసాగిస్తారా అనేది తేలియనుంది. ఇప్పటికే రెండు సార్లు మంత్రి వర్గ ఉపసంఘం, ఒక సారి సీఎస్ తో, ఒకసారి సీఎంతో చర్చలు జరిగిన నేపథ్యంలో మరో మారు చర్చలకు ఎన్జీవోలకు సీఎం నుంచి పిలుపు అందింది. అయితే గతంలో జరిగిన చర్చల నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది. విరమన దిశగా చర్చలు జరగచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ నేపధ్యంలోనే ఇప్పటికే సచివాలయంలో జీఐడి సెక్రటరీ, పొలిటికల్ సెక్రటరీతో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో విభజన వల్ల ఉధ్యోగులకు కలిగే నష్టాల గురించి రాత పూర్వకంగా ఇవ్వాలని ఎపీఎన్జీవోలను కోరినట్లు సమాచారం. అనంతరం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎంతో చర్చలు సమయం ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఎన్జీవోలు ఎన్జీవో కార్యాలయంలో సమ్మెలో ఉన్న అన్ని ఉధ్యోగ సంఘాలతో చర్చించనున్నారు. ఈ చర్చలో అన్ని ఉధ్యోగ సంఘాలు కలిసి సమ్మె కొనసాగించాలా లేక సీఎంపై భారం వేసి తాత్కాలికంగా సమ్మె విరమించి మళ్లీ పార్లమెంట్ సమావేశాలు మొదలు అయినప్పుడు సమ్మెలోకి వెళ్లాల అనేదానిపై చర్చించనున్నారు.

మొత్తం మీద దాదాపు 70రోజులకు పైగా సమ్మె చేస్తున్న సీమాధ్ర ప్రభుత్వ ఉధ్యోగులు విరమణ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే విధ్యుత్తు, ఆర్టీసీ, టీచర్స్, సచివాలయ ఉధ్యోగులు విరమించిన నేపథ్యంలో సీఎం హామీ మేరకు ఏపీఎన్జీవోలు కూడా సమ్మె విరమిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.