Site icon TeluguMirchi.com

కళ తప్పిన మంత్రి అఖిలప్రియ వివాహం

తెలుగు దేశం పార్టీలో అతి చిన్న వయసులో మంత్రి అయిన భూమా అఖిలప్రియ వివాహం ఈ రోజు ఉదయం 10గంటల 57 నిమిషాలకు జరిగింది. అంగరంగ వైభవంగా మంత్రి అఖిలప్రియ, భార్గవరామ్‌ నాయుడుల వివాహం కోసం ఏర్పాట్లు జరిగాయి. ఈ పెళ్ళికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, టీడీపీ నేతలు, సినీ ప్రముఖులు భారీగా హాజరవుతారని భావించారు. భారీగా పెళ్లికి ఏర్పాట్లు చేశారు. కానీ ఈ రోజు ఉదయం నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం వల్ల అక్కడ పెళ్లి కళ తప్పింది.

చంద్రబాబు నాయుడు , మంత్రులు తో పాటు అనేక మంది ప్రముఖులు కూడా హరికృష్ణ మరణ వార్త తెలియగానే ఈ రోజు పర్యటనలు అన్ని వాయిదా వేసుకున్నారు. పెళ్లికి కొన్ని గంటల ముందే హరికృష్ణ చనిపోవడంతో వీఐపీల షెడ్యూల్ మారిపోయింది. కుటుంబ సభ్యుల సమక్షంలో మంత్రి అఖిలప్రియ, భార్గవరామ్‌ నాయుడుల వివాహం జరిగింది.

Exit mobile version