ఆంధ్రప్రదేశ్ మందు బాబులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో మద్యం ధరల్ని 25% తగ్గించింది. .250-300 వరకు ఉన్న మద్యం ధరపై రూ.50 ప్రభుత్వం తగ్గించింది. ఐఎంఎఫ్ఎల్ లిక్కర్‌తో పాటూ విదేశీ మద్యం ధరలు కూడా తగ్గించారు. రూ.50 నుంచి రూ.1350 వరకూ వివిధ కేటగిరీల్లో మద్య ధరలు తగ్గాయి. రేపటి నుంచి తగ్గించిన మధ్యం ధరలు అమల్లోకి రానున్నాయి.. బీరు, రెడీ టూ డ్రింక్ మద్యం ధరల్లో .. రూ.200 క్వార్టర్ బాటిల్ ధరలపై మార్పులు లేవు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలో మద్యం ధరలు కొడ్డెక్కి కూర్చున్నాయి. దీంతో మద్యం ప్రియులు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున మద్యం సరఫరా చేస్తున్నారు.
కొన్ని చోట్ల మద్యం దొరకకపోవడంతో కొంత మంది శానిటైజర్ తాగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం ధరలు అధికంగా ఉన్న కారణంగానే మందు బాబులు శానిటైజర్ వైపు మొగ్గుచూపుతున్నారని ప్రభుత్వానికి అధికారులు సమాచారం అందించారట. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది.