Site icon TeluguMirchi.com

తెలుగు రాష్ట్రాల్లో ప్రమాద స్థాయిలో కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ప్రమాద స్థాయి దాటిపోతున్నాయి. నిన్న ఒక్క రోజే తెలుగు రాష్ట్రాల్లో నాల్గు వందలకు పైగా కేసులు నమోదు అయ్యాయంటే ఏ స్థాయి లో కరోనా ఉదృతి కొనసాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కేసుల తీవ్రత అధికమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 210 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 12వేల771 మంది నమూనాలు పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే, కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించకపోవడం ఊరట కలిగించే అంశం.

ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే..కరోనా కేసులు విలయతాండవం చేస్తున్నాయి. 24గంటల్లో 206 మందికి వైరస్ సోకగా..ఒక్కరోజే 10మంది మృతిచెందడం వణుకు పుట్టించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 152 కేసులు..మేడ్చల్ 18, రంగారెడ్డి 10, నిర్మల్-యాదాద్రిలో ఐదేసి కేసులు…మహబూబ్‌నగర్‌లో 4, జగిత్యాల-నాగర్‌కర్నూలులో రెండేసి కేసులు నమోదయ్యాయి. మహబూబాబాద్, వికారాబాద్, జనగాం, గద్వాల్, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్, మంచిర్యాలలో ఒక్కో కరోనా కేసు నమోదైంది. తెలంగాణలో మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 3వేల496 ఉండగా..ఇప్పటివరకు 123మంది మహమ్మారికి బలయ్యారు.

Exit mobile version