ఏపీ ప్రభుత్వం ఈ రోజు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు జరపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇక పరీక్షల షెడ్యూల్ చూస్తే …
ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్,
ఏప్రిల్ 6న సెకండ్ లాంగ్వేజ్,
ఏప్రిల్ 8న ఆంగ్లం,
ఏప్రిల్ 10న గణితం పరీక్ష,
ఏప్రిల్ 13న సామాన్య శాస్త్రం,
ఏప్రిల్ 15న సాంఘిక శాస్త్రం
ఏప్రిల్ 17న కాంపోజిట్ కోర్సు పరీక్ష,
ఏప్రిల్ 18న వొకేషనల్ కోర్సు పరీక్ష