Site icon TeluguMirchi.com

త్వరలోనే సీఎం తో సమావేశం

ap-secreteriat-employees
ఏపి కి ప్రత్యేక హాదా పై కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వటం లేదు..ఒక సారి ప్రత్యేక హాదా అని..ఇంకొకసారి ప్రత్యక ప్యాకేజి అంటూ ప్రకటనలు చేస్తూ ఏపి ప్రజలను గందరగోళంలోకి నెట్టివేస్తున్నారు. ప్రత్యేక హాదా ఇక రాదు ఏమోనని మునికోటి లాంటి వారు ఆత్మహుతికి పాల్పడుతున్నారు. ఈ అంశాన్ని ఏపిలో ఉన్న ప్రతిపక్షాలు తమ ఆయుధంగా మలిచి తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్నారు. ఏపి బంద్ కి కూడా పిలుపునిస్తున్నారు. ప్రత్యేక హోదా పై కేంద్రంతో చర్చించేదుకు సీఎం చంద్ర బాబు కూడా ఢిల్లీకి వెళ్లారు.

ఇదే సమయంలో ముఖ్యమంత్రికి మద్దతుగా నిలిచేందుకు ఉద్యగులు రంగంలోకి దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ప్రత్యేక హాదా ఇచ్చి అన్ని విధాలుగా అదుకొవాలన్నారు ఏపి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ. నాటి ప్రధాని మన్ మోహన్ సింగ్ ప్రకటన మేరకు తక్షణమే ఏపి ప్రత్యేక హాదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హాదా పై కేంద్ర వైఖరి తెలుసుకునేందుకు త్వరలోనే సీఎం చంద్ర బాబుతో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు…ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర వెనక్కు తగ్గితే విభజనకు వ్యతిరేకంగా ఎలా ఉద్యమించామో…. స్పెషల్ స్టెటస్ కోసం ఇంకా తీవ్ర స్ధాయిలో ఉద్యమిస్తామని అంటున్నారు.

ప్రత్యేక హాదా కోసం రాష్ట్రంలో ఏకమై…ఉద్యమిస్తామన్నారు ఏపి సచివాలయం ఉద్యోగులు. ప్రత్యేక హాదా కోసం ఎవరూ ఎలాంటి ఆఘాత్యాలకు పాల్పడవద్దని…అందరం కలిసికట్టుగా పోరాడి సాధిద్దామని అంటున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హాదా వస్తేనే…పరిశ్రమలు అధికంగా వచ్చి..ఉపాధి లభిస్తుందని..తద్వారా రాష్ట్రం అభివృద్ది చెందుతుందని అంటున్నారు. రాజకీయ పార్టీలు అన్ని కలపి ప్రత్యేక హోదా కోసం పోరాడానికి సిద్దపడుతున్నారు.

Exit mobile version