ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 1100 కు కేసులు చేరుకోగా..తాజాగా ఏపీ రాజ్ భవన్ లో స్టాఫ్ నర్సు ఒకరికి కరోనా పాజిటివ్ రావడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. విజయవాడలోని గవర్నర్ అధికారిక నివాసంలో ఉన్న వైద్య బృందంలో ఈ స్టాఫ్ నర్సు సేవలు అందిస్తున్నారు.
ఇక ఆమెకు కరోనా అని తేలడంతో చికిత్స కోసం విజయవాడలో నియమించబడిన కోవిడ్ -19 ఆసుపత్రిలో చేర్పించారు. ఇప్పటికే కొంతమంది పోలీసులు కూడా ఈ వైరస్ బారిన పడటంతో విజయవాడ నగరం టెన్షన్ లో మునిగి ఉంది. ఈరోజు అక్కడ కొత్తగా 52 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 150ను క్రాస్ చేసింది.