Site icon TeluguMirchi.com

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ ప్రభుత్వం


ఏపీప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ అందించింది. పోలీసుశాఖలో భారీ సంఖ్యలో నియామకాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో భాగంగా 6,100 పోలీస్‌ కానిస్టేబుల్స్‌, 420 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 19న ఎస్‌ఐ పోస్టులకు, జనవరి 22న కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించునున్నారు. ఈ పోస్టుల్లో కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌లో హోంగార్డులకు 15 శాతం రిజర్వేషన్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులలో హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్‌ కల్పించారు.

Exit mobile version