లాక్ డౌన్ ను బ్రేక్ చేస్తే ఏపీ పోలీసులు ఏంచేస్తున్నారో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించిన కానీ జనాలు మాత్రం ఏదో ఒక పని చెప్పి రోడ్ల పైకి వస్తున్నారు. పోలీసులు ఎంత చెప్పిన కానీ వినకుండా వస్తున్నారు. మొన్నటి వరకు పోలీసులు లాఠీలకు పని చెపుతూ , ఫైన్ లు వేస్తూ వచ్చారు కానీ జనాలు మాత్రం దెబ్బలు తింటూ..ఫైన్ లు కడుతూ వచ్చారు కానీ వారి తీరును మాత్రం మార్చుకోలేదు. ఇక వీరికి ఇలా చేస్తే కుదరదని పోలీసులు పాత పద్ధతి ని నమ్ముకున్నారు.

ఏంటా ఆ పాత పద్దతి అనుకుంటున్నారా..ఎవరైనా తప్పు చేస్తే ..క్షేమించాడని పేపర్ ఫై ఓ వెయ్యి సార్లో , 500 వందల సార్లో రాయించడం చేసేవారు కదా..ఇప్పుడు అదే పద్దతిలో పోలీసులు చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కి అలాగే చేయడం తో సదరు వ్యక్తి షాక్ తో బిక్క ముఖం వేసి “సార్… సార్… ఏదో ఫైన్ వేస్తారనుకుంటే… ఇదేంటి సార్… ఇలా రాయమంటున్నారు” ఏంటి అని అడిగాడు. అయినాగానీ పోలీసులు అదే రాయమని చెప్పడం తో చేసేదేం లేక రాసి వెళ్ళాడు. ఇలా రాయడం కంటే ఇంట్లో ఉండడమే మంచిదని అనుకున్నాడట.