Site icon TeluguMirchi.com

ఏపీలో ప్ర‌భుత్వ భూముల క్ర‌మ‌బ‌ద్దీకర‌ణ‌

occupied-lands
ఏపీలో ప్ర‌భుత్వ భూముల క్ర‌మ‌బ‌ద్దీకర‌ణ‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది..దీనికి సంబంధించిన విధివిధానాలు జారీచేసింది స‌ర్కార్….పేద‌ల ఆధీనంలో ఉన్న ప్ర‌భుత్వ భూముల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించాల‌ని గ‌త నెల్లో రాజ‌మండ్రిలో జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసు కుంది…దాని ఆధారంగా తాజాగా ఉత్త‌ర్వులు జారీచేసింది స‌ర్కార్…రాష్ట్రంలో లక్ష‌లాది ఎక‌రాల ప్ర‌భుత్వ భూములు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌య్యాయ‌ని గుర్తించింది స‌ర్కార్…అయితే పేద‌ల‌కు న్యాయం చేయాల‌నే ఉద్దేశంతో క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌ను తెర‌పైకి తెచ్చింది…ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో దారిద్ర‌రేఖ‌కు దిగువ న ఉన్న భూముల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌నుంది స‌ర్కార్…వంద‌గ‌జాల‌లోపు ఉన్న భూములు,ఇళ్ల‌ను ఎలాంటి ఫీజులేకుండా ఉచింతంగా క్ర‌మ‌బ‌ద్దీ క‌రించ‌నుంది ప్ర‌భుత్వం…

ఈనెల 15నుంచి క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది…2014 జ‌న‌వ‌రి ఒక‌టికి ముందు ఆక్ర‌మ‌ణ‌కు గుర‌యిన భూముల‌ను మాత్ర‌మే క్ర‌మ బ‌ద్దీక‌రించ‌నున్నారు. దీనికోసం తెల్ల‌రేష‌న్ కార్డును త‌ప్ప‌నిస‌రి చేసింది…ఆధార్ కార్డు లేదా ఏదైనా ప్రూఫ్ తో ఆయా స్థ‌లాల్లో ఉంటున్న‌ట్లు ‌మ‌ర్పించాలి. ఆగ‌స్ట్ 15నుంచి 120 రోజుల్లోగా మీసేవ‌లో క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి…అయితే క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణకోసం వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌,వాస్త‌వ ప‌రిస్థితుల ప‌రిశీల‌న,అనుమ‌తి కోసం ముగ్గురు అధికారుల‌తో క‌మిటీని నియ‌మించింది ప్ర‌భుత్వం…ఆర్డీవో,స‌బ్ క‌లెక్ట‌ర్,త‌హ‌శీల్గార్ ఆధ్వ‌ర్యంలో పూర్తిస్థాయిలో ప‌రిశీల‌న జ‌రిపిన త‌ర్వాత క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ చేయ‌నుంది ప్ర‌భుత్వం….మొత్తానికి ప్ర‌భుత్వం నిర్ణ‌యంతో రాష్ట్రంలో వేలాది ఎక‌రాల్లో ఆక్ర‌మ‌ణ‌కు గుర‌యిన భూములు పేద‌ల‌కు సొంతం కానున్నాయి.

Exit mobile version