Site icon TeluguMirchi.com

ఏపీ NRT ఉప సలహాదారుగా ఎవరు ఎన్నికయ్యారో తెలుసా ..?

ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల వ్యవహారాల ఉప సలహాదారుగా పెద్దమల్లి చంద్రహాసరెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ పదవిలో చంద్రహాసరెడ్డి రెండేళ్ల పాటు కొనసాగుతారు. . ప్రవాసాంధ్రుల సేవలు, పెట్టుబడులకు సంబంధించి ఆయన సలహాలు అందజేస్తారు.

కడప జిల్లా లింగాల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన పి.చంద్రహాసరెడ్డి అందించే సేవలకు ప్రభుత్వం నెలకు రూ.2లక్షల వేతనంగా నిర్ణయించింది. పీఏ, ఇతర అలవెన్సుల కోసం మరో రూ.70,000, వాహనం, ఇంధనం కోసం రూ.60,000 మొబైల్ , డేటా కోసం రూ.2000, నివాసానికి అద్దె కింద ప్రభుత్వ క్వార్టర్స్ లేదా రూ.50,000 చెల్లించనున్నారు. భారత్‌లో పర్యటించినప్పుడు టూ టైర్ ఏసీ, ఫ్లైట్‌లో ఎకానమీ క్లాస్‌లో పర్యటించవచ్చు.

Exit mobile version