ఏపీ ప్రభుత్వ కొత్త సీఎస్‌గా కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఉత్తరువులు జారీ !


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్‌ జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. జవహర్‌ రెడ్డిని సీఎస్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌ సమీర్‌శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. డిసెంబర్‌ 1 నుంచి కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డి బాధ్యతలు తీసుకుంటారు. జవహర్‌ రెడ్డి ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన సీఎం జగన్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పని చేశారు.