ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం (జూన్ 19) రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబందించిన ఎన్నికలను అసెంబ్లీ ప్రాంగణంలో జరగనున్నాయి. దీనికి సంబందించిన అన్ని ఏర్పట్లను అధికారులు పూర్తి చేసారు.
ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఐదు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు రిటర్నింగ్ అధికారి ఫలితాలు వెల్లడిస్తారు. వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు రాజ్యసభ బరిలో నిలిచారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామిక వేత్త, రాంకీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డి, గుజరాత్ కు చెందిన అంబానీ సన్నిహితుడు పరిమల్ నత్వాని బరిలో ఉన్నారు. టీడీపీ తరపున వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు.