Site icon TeluguMirchi.com

వైసీపీ నేతల్లో వణుకు..

వైసీపీ నేతలు వణికి పోతున్నారు..కారణం రాష్ట్ర మంత్రి ధర్మన్న కుమారుడికి కరోనా రావడమే..ప్రస్తుతం ఏపీ లో కరోనా తీవ్రత ఏ రేంజ్ లో ఉందొ చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజు రెండు వేల చేరువలో కేసులు నమోదు అవుతున్నాయి. కాగా తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి ధర్మన్న కుమారుడికి కరోనా సోకింది. అలాగే గన్‌మెన్లకు కూడా పాజిటివ్‌గా తేలింది.

దీంతో సదరు మంత్రి హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారట. ఇక ఇప్పుడు మొన్నటి వరకు ఈ మంత్రి తో తిరిగిన మిగతా మంత్రుల్లో ఆందోళన మొదలు అయ్యింది. ప్రస్తుతం వారంత కరోనా టెస్ట్ లు చేయించుకుంటున్నట్లు సమాచారం.

Exit mobile version