ఏపీలో ఒకేరోజు 350 కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉదృతి తీవ్ర స్థాయి లో ఉన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం తో ప్రభుత్వం సైతం ఎలా ఈ కేసులను కంట్రోల్ చేయాలో అర్ధం కానీ పరిస్థితి లో ఉంది. తాజాగా రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 351 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి.

24 గంట‌ల్లో 15,188 టెస్టులు చేయ‌గా.. 351 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాయి.. వీరిలో స్థానికులు 275 మంది కాగా.. విదేశాలు, ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన‌వారు 76 మంది ఉన్నారు.. మ‌రోవైపు ఇద్ద‌రు మ‌ర‌ణించారు.. తాజా కేసుల‌తో… రాష్ట్రవ్యాప్తంగా న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5.555కు పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య‌.. 7071కి చేరింది.