ఏపీలో పెద్దఎత్తున క్వారంటైన్ కేంద్రాలు

విదేశాలు, పలు రాష్ట్రాల నుంచి వచ్చే వారికోసం పెద్దఎత్తున క్వారంటైన్ కేంద్రాలు సిద్దం చేయాలని సీఎం జగన్‌ అదేశించారు. లాక్‌డౌన్‌ సడలింపు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిపట్ల తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. విదేశాల నుంచి వచ్చే వారికి దాదాపుగా నాన్‌ కొవిడ్‌ సర్టిఫికెట్‌ ఉంటుందని, వారికి హోం క్వారంటైన్‌ విధిస్తామని.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించి పరీక్షించి కరోనా సోకలేదని తేల్చాకే ఇళ్లకు పంపుతామని చెప్పారు.

కాగా గత 24 గంటల్లో 7902 శాంపిల్స్ ను పరీక్షిస్తే 60 మందికి కరోనా ఉన్నట్టుగా తేలిందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన 1463 కేసుల్లో 1027 కేసులు యాక్టివ్ కేసులుగా ప్రభుత్వం తెలిపింది. కరోనా సోకిన రోగులు 403 మంది ఇప్పటివరకు ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు.