ఆంధ్రప్ర‌దేశ్ లో మాన‌వ వ‌న‌రుల అభివృద్ది కేంద్రం

cbn-ap-rajadani
ఆంధ్రప్ర‌దేశ్ లో మాన‌వ వ‌న‌రుల అభివృద్ది కేంద్రం ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. హైద‌రా బాద్‌లో ఉన్న చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ది త‌ర‌హాలో దీనిని అభివృద్ది చేయ‌నుంది. ఏపి నూత‌న రాజ‌ధాని ప‌రిధిలోని దీనిని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన ప్ర‌భుత్వం ఈ సంస్ధ‌కు రిటైర్డ్ ఐఏయ‌స్ అధికారి డి చ‌క్ర‌పాణిని డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ గా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. హైద‌ర‌బాద్‌లో ఉన్న ఎంసిహెచ్ఆర్‌డి నిర్వ హ‌ణ రెండు ప్ర‌భుత్వాల‌కు సంబంధించిది అయిన‌ప్ప‌టికీ..ఏపికి ప్రాతినిధ్యం లేకుండా తెలంగాణ ప్ర‌భుత్వం ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో ఏపి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ప‌దో షెడ్యూల్ లోని సంస్ధ‌ల విభ‌జ‌న పై కేంద్రం లేదా కోర్టు సూచ‌న‌ల మేర‌కు జ‌రిగే వ‌ర‌కూ..రెండు ప్ర‌భుత్వాల‌కు భాగ‌స్వామ్యం ఉన్న‌ప్ప‌టికీ..తెలంగాణ వైఖ‌రి కార‌ణంగా..ఏపిలో నూత‌న మాన‌వ వ‌న‌రుల అభివృద్ది కేంద్రం ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వ స్ప‌ష్టం చేసింది. దీని కోసం ప్ర‌త్యేకంగా నిధులు కూడా కేటాయించింది ఏపి ప్ర‌భుత్వం.