Site icon TeluguMirchi.com

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడం తో హైకోర్టు ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. హైకోర్టు అధికారులు, సిబ్బంది కేంద్ర కార్యాలయం వదిలి వెళ్లరాదని ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా అలా కార్యాలయం విడిచి వెళ్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.

అలానే కోర్టు వరండాల్లో జనసమూహం ఎక్కువగా ఉండటానికి వీల్లేదని… కోర్టు ఆవరణలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. కొత్త మార్గదర్శకాలను ఉద్యోగులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు రిజిస్ట్రార్ పేర్కొన్నారు.

Exit mobile version