ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తుల శాఖలు మార్పు, ఏ శాఖకు ఎవరంటే …

ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గోస్వామి రోస్టర్‌లో కీలక మార్పులు చేశారు. తాజా రోస్టర్‌ ప్రకారం,

  • కీలక శాఖలైన గనులు, పరిశ్రమలు, రహదారులు, భవనాలకు సంబంధించిన కేసులను జస్టిస్‌ బట్టు దేవానంద్‌ విచారించనున్నారు.
  • క్వాష్‌ పిటిషన్లు, హోం శాఖకు సంబంధించిన వ్యాజ్యాలను ఇకపై జస్టిస్‌ రావు రఘునందన్‌రావు విచారించనున్నారు.
  • బెయిల్‌ పిటిషన్లు, క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లు, క్రిమినల్‌ ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్లను జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ విచారిస్తారు.
  • అత్యంత కీలకమైన రెవెన్యూ కేసులను జస్టిస్‌ మఠం వెంకటరమణకు అప్పగించారు.
  • పంచాయతీలు, మునిసిపాలిటీలు, సీఆర్‌డీఏ కేసులను జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్‌ విచారిస్తారు.