ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలోని MIG లేఅవుట్లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10% మేర ప్లాట్లను రిజర్వు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాట్ల ధరలోనూ 20% మేర రిబేట్ ను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ. పీఆర్సీ ప్రకటన సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు ప్లాట్లలో రిజర్వేషన్, ధరలో రిబేట్ ను ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చిన పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి