కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న అర్చకులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిన్న ఆలయాల్లో పని చేసే అర్చకులకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.
చిన్న దేవాలయాల్లో పనిచేసే అర్చకుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ‘అర్చక వెల్ఫేర్ ఫండ్’ ద్వారా ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినట్టు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కరోనా నేపథ్యంలో వనరుల లేమితో అర్చకులు ఇబ్బందులు పడుతున్నందున వారిని ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయంతీసుకున్నామని తెలిపారు.
లాక్ డౌన్ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ కేవలం ఆగమ శాస్త్రం ప్రకారం నిత్య కృతులు మాత్రమే జరుగుతున్నాయి.