పవన్‌కు లెక్కల నివేదిక పంపిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రత్యేక హోదా సాధన కోసం పవన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన జేఎఫ్‌సీ తాజాగా కేంద్రం నుండి వచ్చిన నిధులు ఎన్ని, ఖర్చు ఎలా జరిగింది, విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు ఏంటో తెలియజేయాల్సిందిగా ఆర్టీఐ ద్వారా ఏపీ మరియు కేంద్ర ప్రభుత్వాలను కోరిన విషయం తెల్సిందే. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు స్పందించలేదు. కాని ఏపీ ప్రభుత్వం మాత్రం 118 పేజీల నివేదికను తయారు చేసి పంపించింది.

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు కేంద్రం నుండి వచ్చిన నిధుల లెక్కలు మరియు ఏపీకి ఇవ్వాల్సిన నిధులు ఇలా అన్ని లెక్కలను ఏపీ ప్రభుత్వ ప్రతినిధి స్వయంగా అమరావతి నుండి వచ్చి హైదరాబాద్‌లోని జనసేన కార్యలయంలో ఇవ్వడం జరిగింది. జనసేన కార్యలయంలో పవన్‌ అందుబాటులో లేకపోవడంతో అదే సమయంలో అక్కడ ఉన్న ఆయన వ్యక్తిగత సిబ్బందికి ఇవ్వడం జరిగింది.